కంచ గచ్చిబౌలి కేసు విచారణ మళ్లీ వాయిదా

కంచ గచ్చిబౌలి కేసు విచారణ మళ్లీ వాయిదా
  • వచ్చే నెల 11న బెంచ్ ముందుకు వచ్చే చాన్స్​

న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ భూ వ్యవహారంలో సుమోటో కేసుతోపాటు ‘బీ ఫర్‌‌‌‌ ది ఛేంజ్‌‌‌‌ సొసైటీ’, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఈ పిటిషన్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్య బగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు లిస్ట్ అయ్యాయి. ఈ కేసులో అదనపు డాక్యుమెంట్లు సమర్పించడానికి ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరింత సమయం కోరింది. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ పిటిషన్లను వచ్చే నెల 16న సుప్రీంకోర్టు విచారణ జాబితాలో కోర్టు రిజిస్ట్రీ పొందుపరిచింది.